Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూజిలాండ్‌లో దూబె దుమ్మురేపుతాడు.. నాయర్‌ ఏమన్నాడంటే!

Shivam Dube will rock in New Zealand says Abhishek Nayar
Advertisement
  • న్యూజిలాండ్‌లో దూబె బౌలింగ్‌ మరింత ప్రభావవంతంగా ఉంటుందన్న నాయర్‌
  • నితీశ్‌ కంటే దూబెకు అంతర్జాతీయ అనుభవం ఎక్కువని వెల్లడి
  • కీలక మ్యాచ్‌ల్లో బౌన్సర్లతో వికెట్లు తీసిన అనుభవం దూబెకు ఉందని వ్యాఖ్య
  • దూబె ఎత్తు వల్ల విదేశీ పిచ్‌లపై అదనపు బౌన్స్‌ వస్తుందని వివరణ
  • భారత జట్టు కూర్పునకు దూబె సరిపోతాడని అభిప్రాయం
Advertisement
న్యూజిలాండ్‌ పిచ్‌లపై భారత ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపగలడని టీమిండియా మాజీ సహాయ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ అభిప్రాయపడ్డాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డితో పోలిస్తే దూబెకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెరుగైన అనుభవం ఉందని, బౌన్సర్లు వేయడంలో అతడికి మంచి సామర్థ్యం ఉందని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌ల్లో దూబె రాణించిన తీరు కూడా అతడిపై నమ్మకాన్ని పెంచుతోందని తెలిపాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఆ స్థాయిలో తన పాత్రను నిరూపించుకోలేదని నాయర్‌ చెప్పాడు. మరోవైపు, ప్రపంచకప్‌లో కీలక సమయాల్లో దూబె బౌన్సర్లు, షార్ట్‌ పిచ్‌ బంతులతో ప్రత్యర్థి వికెట్లు తీసి సత్తా చాటాడని గుర్తుచేశాడు.

“దూబె పొడవైన బౌలర్‌. విదేశీ పరిస్థితుల్లో అతడి ఎత్తు వల్ల బంతికి అదనపు బౌన్స్‌ లభిస్తుంది. బ్యాటింగ్‌లోనూ అతడు భారీ షాట్లు ఆడగలడు. ప్రస్తుత భారత జట్టు కూర్పునకు అతడు బాగా సరిపోతాడు. అందుకే న్యూజిలాండ్‌ పరిస్థితుల్లో దూబె మరింత ప్రభావవంతంగా ఉంటాడని భావిస్తున్నా” అని జియోస్టార్‌తో నాయర్‌ పేర్కొన్నాడు.

భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా న్యూజిలాండ్‌పై కీలక పాత్ర పోషించగలడని నాయర్‌ విశ్లేషించాడు. ఆరంభంలో సీమ్‌, స్వింగ్‌కు పేసర్లకు అనుకూలత లభించే అవకాశం ఉందని.. పిచ్‌పై బంతి పెద్దగా పక్కకు మళ్లనప్పుడు మణికట్టు స్పిన్నర్లు ప్రభావం చూపగలరని వివరించాడు.

కుల్‌దీప్‌ బంతిని విసిరే విధానం, బ్యాటర్లకు ఎదురయ్యే అనిశ్చితి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతాయని చెప్పాడు. పవర్‌ప్లే తర్వాత కుల్‌దీప్‌, వరుణ్‌ చక్రవర్తిలను ఎప్పుడు బౌలింగ్‌కు దించాలన్నది వ్యూహాత్మకంగా కీలకమవుతుందని పేర్కొన్నాడు.
Advertisement
Advertisement
Shivam Dube
Abhishek Nayar
Team India
New Zealand vs India
Nitish Kumar Reddy
Kuldeep Yadav

More Telugu News